మంగళగిరి శివాలయంలో లింగంపై హనుమంతుని ప్రతిమ

70చూసినవారు
మంగళగిరి నగరంలోని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శనివారం హనుమంత జయంతిని పురస్కరించుకుని ఆలయ అర్చక పర్యవేక్షణ పురోహితులు శ్యామ సుందరశాస్త్రి శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివలింగానికి గంధంతో తాపడంవేసి హనుమంతుని ప్రతిమని చేతితో చిత్రీకరించారు. హనుమంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్