కొరిశపాడు మండలంలో రబి సీజన్ లో అక్టోబర్ ఒకటో తేదీ నుండి ఆయా పంటలు సాగుచేసిన రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని ఏవో శ్రీనివాసరావు మంగళవారం తెలియజేశారు. పంట నమోదు చేసుకుంటేనే రైతులు పంట అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. పంట నమోదు తో పాటు ఒకేసారి ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయించుకోవాలని శ్రీనివాసరావు తెలియచేశారు. రైతులు వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని ఆయన సూచించారు.