బాపట్ల ప్రాంతంలో బాబుల్ రెడ్డి అనే రియల్ వ్యాపారి లేఔట్లను వెయ్యటమే కాక ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నాడని అతనిపై చర్య తీసుకోవాలని బాపట్ల జిల్లా బి. ఎస్. పి అధ్యక్షుడు కాగిత కోటేశ్వరరావు ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బాపట్ల, అప్పికట్ల, కర్లపాలెం ప్రాంతాలలో అధికారుల అండదండలతో రియల్ వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు.