బాపట్ల జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల అవగాహన కార్యక్రమాలలో భాగంగా బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని పట్టణ కార్యాలయము నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల తహసిల్దార్ ఎస్. కె సలీమా, డిసిపిఓ పురుషోత్తమరావు, బాలల సంరక్షణ అధికారి జి. కృష్ణ, సి. డి. పి. ఓ పార్వతి, జిల్లా బాలల పరిరక్షణ పరిరక్షణ సభ్యులు అంగనవాడి కార్యకర్తలు పాల్గొన్నారు.