బాపట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు శుక్రవారం గుంటూరు శ్యామలానగర్ లోని ఎన్ సీసీ గ్రూప్ కార్యాలయంలో ఎన్ సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ ఎం చంద్ర శేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్ సీసీ క్యాంటీన్లో సౌకర్యాలు, సమస్యలపై ఆయనతో చర్చించారు. గుంటూరు మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట రామి రెడ్డి, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పలువురు పాల్గొన్నారు.