డిసెంబర్ 7 వ తేదిన బాపట్లకు మెగా పెరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళితో పాటు అధికారులు హెలిప్యాడ్ స్థలం, సభ ప్రాంగణం ను పరిశీలించారు. హెలిపాడ్ స్థలాన్ని యుద్ధ ప్రాతిపదికపై ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు.