రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 7న బాపట్ల జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో శనివారం జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అదనపు ఎస్పీ విఠలేశ్వర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. సభాస్థలికి వచ్చే రూట్ మ్యాప్ ను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు.