సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో భాగంగా ఇంటింటా ఓటర్ల సర్వే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి వివేక్ యాదవ్ తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలతో మంగళవారం ఆయన అమరావతి నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా రూపొందించడానికి ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు ఇంటింటా ఓటర్ల సర్వే ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.