బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ కు అందించారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వెంకట మురళి ప్రతి అర్జీని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.