వేమూరు మండలం చావలి గ్రామంలో ఆదివారం స్థానిక కళ్యాణమండపం నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిందని ఆయన చెప్పారు. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.