రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తప్పక పాటించి అధిక దిగుబడులు పొందాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. మంగళవారం బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో పొలం పిలుస్తుంది గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రతి మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగంచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కూటమి శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.