విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో తన ఇల్లు కాలిపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కొరిశపాడు గ్రామానికి చెందిన కసుకుర్తి శ్రీనివాసరావు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి కరెంటు వస్తూ, పోతూ ఉండటంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు కాలిపోవడంతో పాటు, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా దగ్ధమయ్యాయి అని ఆయన వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని కోరారు.