పిట్టలవానిపాలెం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బగళాముఖి అమ్మవారు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు. అమ్మవారికి ఇష్టమైన రోజు శుక్రవారం కావడంతో ఆలయ నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేసి పలురకాల పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి ఫలహారాలు సమర్పించారు. ఈ మేరకు అమ్మవారి అలంకార రూపాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక చిత్రాన్ని విడదల చేసారు.