బాపట్ల: మమ్మల్ని మనుషులుగా గుర్తించండి

63చూసినవారు
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్ల నుండి బయటకు రాలేక త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆదివారం బాపట్ల పట్టణం జగనన్న కాలనీవాసులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని మనుషులుగా గుర్తించి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వేడుకున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు వెనుకాడమని అధికారులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్