బాపట్ల పట్టణం చిలు రోడ్ రామాలయంలో శుక్రవారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుకు ప్రత్యేక పూజలను బాపట్ల విశ్వహిందూ పరిషత్ కమిటీ సభ్యులు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ బాపట్ల పట్టణ కార్యదర్శి బండ్రెడ్డి రజని, ఉప్పాల మురళి గౌడ్ మాట్లాడుతూ మత ద్వేషాలు లేకుండా ప్రజలందరూ ఉండాలన్నారు. రాష్ట్రాలలో హిందూ , ముస్లిం , క్రైస్తవులు అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ఉండాలని వారు ఆకాంక్షించారు.