మత్తు పానీయాలు, పోర్న్ సైట్స్ నిషేధించాలి: ఏఐఎస్ఎఫ్

71చూసినవారు
కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేయడం దారుణమని, పోర్న్ సైట్స్, మత్తు పానీయాలను తక్షణమే నిషేధించాలని పల్నాడు ఏఐఎస్ఎఫ్ ఇన్ ఛార్జ్ భగత్ సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం చిలకలూరిపేటలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్యురాలిపై జరిగిన ఘటన ఖండిస్తూ నిరసనగా వారు ర్యాలీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్