చిలకలూరిపేట పట్టణ పరిధిలో పనిచేసే వివిధ చేతి వృత్తుల వారికి నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందించి, ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిబాబు ఆదివారం తెలిపారు. పట్టణ పరిధిలోని కార్పెంటర్లు, ఎలక్ట్రిషన్లు, ఏసీ అన్ని రకాల సేవలు అందించే వారికి శిక్షణ అందించి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఆసక్తి కలవారు ఈ నెల 30 తేదీ లోపు మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.