కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 9, 10 తేదీలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ పిలుపునిచ్చారు. చిలకలూరిపేట సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏరియా సీపీఐ సమావేశం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాలతో పాటు 10వ తేదీని డిమాండ్స్ డేగా ప్రకటిస్తున్నామన్నారు.