నాదెండ్ల: క్రికెట్ ఆడి అలరించిన ఎమ్మెల్యే

68చూసినవారు
నాదెండ్ల: క్రికెట్ ఆడి అలరించిన ఎమ్మెల్యే
క్రీడాకారులకు కూటమి ప్రభుత్వ సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని, మంచి ఆటతీరుతో రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. శనివారం నాదెండ్ల మండలం చందవరంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలపై మక్కువ పెంచుకునే యువత అంచెలంచెలుగా ఉన్నతస్థానాలకు ఎదిగేలా ఆయా రంగంలో రాణించాలని, ఆ దిశగా కఠోర సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్