పాండురంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం

1871చూసినవారు
పాండురంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహం
వాడరేవు వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం గల్లంతైన కావూరివారిపాలెంకు చెందిన జైపాల్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం బాపట్ల పక్కన ఉండే పాండు రంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని చీరాల రూరల్ పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. జైపాల్ తో సహా ముగ్గురు వాడరేవులో సముద్ర స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రమాదం నుండి బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్