చీరాల పట్టణ పరిధిలోని దీపావళి బాణసంచా విక్రయించే దుకాణాలకు, నిల్వ చేసే గోడౌన్స్ కు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి ఉండాలని చీరాల వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.