ఇంగ్లాండ్ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ గా చీరాల వాసి

50చూసినవారు
ఇంగ్లాండ్ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ గా చీరాల వాసి
ఇంగ్లాండ్ పార్లమెంటు ఎన్నికల బరిలో చీరాల వాసి మువ్వల చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. లండన్ కి సమీపంలోని స్లవ్ పార్లమెంటు స్థానం నుండి ఆయన బరిలో నిలిచారు. స్లవ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా అధికార కన్జర్వేటివ్ పార్టీ నుండి 2019 తొలిసారిగా పోటీకి దిగి ఓడినప్పటికీ, 2021, 23 ఎన్నికల్లో గెలిచారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా స్లవ్ టికెట్ ను ఆయన ఆశించినా కన్జర్వేటివ్ పార్టీ ఇవ్వలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్