కారంచేడు దమన కాండలో ప్రాణాలు కోల్పోయిన మృతవీరులకు బాధిత కుటుంబాల సభ్యులు, దళిత, ప్రజా సంఘాల నేతలు చీరాల విజయనగర్ కాలనీ సమీపంలోని రుధిర క్షేత్రం వద్ద బుధవారం ఘనంగా నివాళులర్పించారు. దుడ్డు భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో పలువురు నేతలు, ప్రొఫెసర్లు, విప్లవ రచయితలు పాల్గొని మాట్లాడారు. దళిత సమస్యలపై సమిష్టిగా అందరూ పోరాడాలన్నారు. కృపాకర్ మాదిగ, బాబురావు, భగత్ సింగ్, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.