డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్లో ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాదిగ మహాసేన రాష్ట్ర అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నగర ఎస్సి నాయకులు నూనె వెంకట్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని తెలియజేశారు.