వార్డు సచివాలయాల వారీగా నూతన స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటుకు మెప్మా సీఎంఎం, సీఓలు చర్యలు చేపట్టాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం మెప్మా, పరిపాలన, లీగల్ సెల్ విభాగాల సమీక్షా సమావేశం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శనివారం నూతన గ్రూపుల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్షా చేస్తామని చెప్పారు. హిజ్రాలతో స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు.