బైక్ నడిపే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరు నగరంలోని ప్రధాన సెంటర్లలో హెల్మెట్ వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ రమేశ్ మాట్లాడుతూ అనుకోకుండా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే హెల్మెట్ తమ ప్రాణాలను కాపాడుతుందన్నారు. హెల్మెట్ ధరించని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.