గుంటూరు: బోరుగడ్డ అనిల్ కు 14 రోజుల రిమాండ్

62చూసినవారు
వైసీపీ అభిమాని బోరుగడ్డ అనిల్ కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షల అనంతరం గుంటూరు జిల్లా కోర్టులోని 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో ఆయనకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించనున్నారు. అనిల్ ను నిన్న రాత్రి నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్