గుంటూరు క్రిస్టియన్ మైనారిటీ నాయకులు విజయ్ వాసిమల్ల ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పలు క్రిస్టియన్ సమస్యలపై వినతి పత్రంశుక్రవారం సమర్పించారు. 1998 మెమో రద్దు,సమాధుల తోట,క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి, తదితర సమస్యలను అప్పిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.
వీటిపై స్పందించిన అప్పిరెడ్డి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ క్రైస్తవ నాయకులు విజయ్ వాసిమల్ల, ప్రెసిడెంట్ బాలశౌరి,రాజశేఖర్,తిమోతి తదితరులు పాల్గొన్నారు.