మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు రాష్ట్ర బి. సి నాయకులు కాటూరి విజయ్ ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు కాటూరి విజయ్ మాట్లాడుతూ.. విద్యాలయాలు దేశానికి వెలుగులు విరజిమ్మే దివిటీలు అని పూలే గారి మాటలను గుర్తు చేసుకుంటూ. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా పూలే , అంబేడ్కర్ మార్గంలో పయనించి బడుగుల బ్రతుకులో వెలుగులు నింపాలని ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు జగన్ అన్నకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సీపీ నాయకులు, మద్దు జ్యోతి బాబు, వాసిమల్ల విజయ్, 55 వ వార్డ్ కార్పొరేటర్ అంబేడ్కర్, ఐటీ వింగ్ అధ్యక్షులు మాదాసు కిరణ్, అంకాల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.