కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: విడదల రజిని

59చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. ప్రేమోన్మాది చేతిలో బ్రెయిన్ డెడ్ కు గురై మృతిచెందిన సహాన కుటుంబాన్ని మంగళవారం గుంటూరులో ఆమె పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. మహిళలకు రక్షణ లేదనడానికి సహాన ఘటనే నిదర్శనమన్నారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉన్నాయని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్