శరన్నవరాత్రులకు సిద్ధమవుతున్న దేవస్థానం

71చూసినవారు
గుంటూరు ఆర్. అగ్రహారంలో ప్రసిద్ధిగాంచిన కన్యకాపరమేశ్వరీ దేవస్థానంలో 103వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 3నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మంగళవారం ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటూ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత పోస్ట్