గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు సీటీ స్కాన్ మిషన్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం డాక్టర్ కిరణ్ కుమార్ ఆ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూ. 42 లక్షలతో యంత్రాలకు మరమ్మతులు చేయించిందని తెలియజేశారు. మూడేళ్లుగా సీటీ స్కాన్ మిషన్ లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారని తెలిపారు.