గుంటూరు- విజయవాడ నుంచి బయలుదేరిన బస్సులు, లారీలు చుట్టు గుంట వద్ద సత్తెనపల్లి-నర్సరావుపేట వైపు వెళ్లకుండా దారిని బైపాస్ లో అంకిరెడ్డిపాలెం నుంచి దారి మళ్లించారు. సోమవారం సాయంత్రం హౌసింగ్ బోర్డు వద్ద మాలల మహాగర్జన బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డీఎస్పీ రమేశ్ పర్యవేక్షణలో చర్యలు చేపట్టారు. సీఐ సింగరయ్య, ఎస్ఐ శ్రీహరి, సాంబశివరావు నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.