న్యూఢిల్లీ ప్రగతి మైదానం 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేయిర్-2024లో పాల్గొని మొదటి బహుమతి సాధించిన మంగళగిరికి చెందిన లక్ష్మీ సామ్రాజ్యంకు, కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో మెమెంటో అందజేశారు. స్నేహ మహిళా డ్వాక్రా గ్రూపు సభ్యురాలైన సామ్రాజ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తన ఉత్పత్తులైన మంగళగిరి చేనేత వస్త్రాలను అత్యధికంగా అమ్మటంతో ఆమెకు ఈ అవార్డు లభించింది.