వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి

82చూసినవారు
వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గల్లా మాధవి
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సోమవారం పాల్గొన్నారు. మంత్రులు, స్థానిక నేతలతో కలిసి గొల్లపూడి, సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితుల పరిస్థితిని స్వయంగా గమనించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు వచ్చి విజయవాడలో ఎంతో నష్టం కలిగించాయని చెప్పారు. వరద బాధితులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్