భారతదేశ ప్రగతిలో టాటాల పాత్ర అనే అంశంపై ఆదివారం గుంటూరులో సదస్సు జరిగింది. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణరావు మాట్లాడుతూ భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలో రతన్ టాటా పాత్ర ఎంతో ఉందని అన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో రతన్ టాటా ఎనలేని కృషి చేశారని ఆయన వెల్లడించారు.