దాచేపల్లి పోలీస్ స్టేషన్ ను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.