అధిక వర్షాలు కూడా తట్టుకొని రైతుకి ఎటిఎం మోడల్ ముల్లంగి ఆదాయాన్ని ఇస్తుందని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి అన్నారు. గురువారం ఆమె పిడుగురాళ్ల సబ్ స్టేషన్లోని గుత్తికొండ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వేసిన ముల్లంగి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తుఫాను ప్రభావం వల్ల కొన్ని పంటలు నష్టపోయినప్పటికీ ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు ఆరోగ్యంగా ఉందన్నారు.