దాచేపల్లి ఎంఈఓ -1గా మల్లికార్జున శర్మ బాధ్యతలు

50చూసినవారు
దాచేపల్లి ఎంఈఓ -1గా మల్లికార్జున శర్మ బాధ్యతలు
దాచేపల్లి ఎంఈఓ -1గా మల్లికార్జున శర్మ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎం ఈ ఓ - 1గా పనిచేసిన కాంతారావు మృతి చెందడంతో రాజుపాలెం ఎంఈఓగా పనిచేస్తున్న మల్లికార్జున శర్మను దాచేపల్లి ఇన్ చార్జ్ ఎంఈఓగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో విద్యాపరంగా ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి విద్యాభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్