ఈదురు గాలులకు నేలకూలిన చెట్టు

64చూసినవారు
మాచర్లలో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న భారీ చెట్టు కూలిపోయింది. సమయానికి అక్కడ ఎవరు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చెట్టు కూకటివేళ్లతో పెకలించుకుని పడిపోయిందన్నారు. చెట్టు ఉన్న ప్రాంతంలో మున్సిపాలిటీ ట్యాప్ ఉండటం, సదరు ట్యాప్లో నిత్యం నీరు లీక్ అవుతుండటంతో ఆ ప్రాంతం తడిగా మారి చెట్టు పడిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్