కారంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరుల ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం పరిశీలించారు. ఉత్సవాలలో శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చాపకూడు కార్యక్రమానికి నేడు హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సందర్శనలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన వెంట గురజాల డీఎస్పీ జగదీశ్, పోలీస్ అధికారులు ఉన్నారు.