గడచిన రెండు నెలలుగా మాచర్ల పురపాలక సంఘ కార్యాలయంలో శానిటేషన్ ఇంజినీరింగ్ విభాగాలలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘ నాయకులు అబ్రహం లింకన్ డిమాండ్ చేశారు. మంగళవారం మాచర్ల పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని అఖిలపక్ష నాయకులు తెలిపారు.