సామాజిక న్యాయాన్ని అమలు చేసి ఆచరణలో పెట్టిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మాచర్ల లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.