కారంపూడి మండలం పెద్దకొదమగుండ్ల గ్రామానికి చెందిన జనసేన నాయకులు మాడ రామకృష్ణ వ్యవసాయ భూమిలో పండించిన మొక్కజొన్న పంటను కొంతమంది గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. రామకృష్ణ పొలానికి వెళ్లి చూసేసరికి పంట పొలం అంతా తొక్కి ధ్వంసం అయ్యి ఉండడంతో గురువారం సదరు విషయాన్ని స్థానిక పోలిస్ స్టేషన్లో జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త రామాంజనేయులు దృష్టికి తీసుకోచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.