మోపిదేవి మీడియా సమావేశం

1742చూసినవారు
బాపట్ల జిల్లా రేపల్లె లో మోపిదేవి వెంకటరమణ రావు మీడియా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదరణ పేరుతో పేదల కడుపు కొట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని, పేదలకు ఇస్తున్న సెంటు భూమిని సమాధులతో పోల్చడం దుర్మార్గం అని, వెంటనే ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలి అని అన్నారు. తమ హయాంలో పేదలకు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలను ఇచ్చారని, ఆ స్థలాలలో బ్రహ్మాండమైన ఇల్లు నిర్మిస్తున్నారన్నారు. రాజధానిలో జోనులను తీసుకువచ్చింది మీ స్వలాభం కోసమే అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్