సత్రశాల శివాలయం గ్రీన్ టెంపుల్ గా ఎంపిక

70చూసినవారు
సత్రశాల శివాలయం గ్రీన్ టెంపుల్ గా ఎంపిక
పల్నాడు రెంటచింతల మండల పరిధిలోని సత్రశాలలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం ఐటీసీ &సెర్చ్ ఆధ్వర్యంలో డస్ట్ బిన్స్ పంపిణీ చేసారు. ఐటీసీ సీఓ మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ ఈ శివాలయాన్ని గ్రీన్ టెంపుల్ గా ఎంపిక చేసినట్టు తెలిపారు. దేవాలయంలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలను ప్రజల భాగస్వామ్యంతో సక్రమమైన పద్ధతిలో నిర్వహించడం ద్వారా దేవాలయాలను వ్యర్థ రహిత దేవాలయాలుగా తీర్చిదిద్దవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్