రెండు రోజులుగా మాచర్ల, నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పర్యాటక రంగంలో ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతం శనివారం వర్షపు నీటితో నురగలు గక్కుతూ పర్యాటకులను కనువిందు చేస్తూ ఉంది. ఎత్తిపోతల జలపాతం సోయగాలు చూసేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉన్నారు.