మాచర్ల పట్టణంలోని 21, 22 వార్డులను మున్సిపల్ ఛైర్మన్ పోలూరి నరసింహారావు, కమిషనర్ వేణుబాబు బుధవారం సందర్శించారు. వార్డు ప్రజలు మంచినీటి సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మంచినీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. యాదవుల బజార్ నుంచి కొత్తపల్లి వరకు ఉన్న టర్నింగ్ కల్వర్ట్ పైపులైన్ మరమ్మతు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.