తాడేపల్లిలో గుర్తు తెలియని యువకుని మృతి

15859చూసినవారు
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో బుధవారం తెల్లవారుజామున అనుమాన్పద స్థితిలో యువకుడు మృతి చెందారు. బ్రహ్మానందపురం సమీపంలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో ఫారెస్ట్ లో చెట్టుకు నార్త్ ఇండియాకు చెందిన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్యా లేక ఆత్మహత్య అన్న కోణంలో విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్