రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ ని గెలిపించాలి: లావణ్య

79చూసినవారు
మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ ని గెలిపించాలని మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య అన్నారు. ఈ మేరకు శనివారం మంగళగిరి పరిధి నూతక్కిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్ తోనే అభివృద్ధి సాధ్యమని మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని లావణ్య విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ హనుమంతరావు, కాండ్రు కమల తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్